Dear Rohith…

By Ponni Arasu

This letter is part of Holding Movements, Agitating Epistemes: A Multipart Series On Remembering, Retelling, And Dreaming For Justice co-convened and co-edited by Richa Nagar and Ponni Arasu.


I dedicate this piece to Radhika Vemula, Rohith Vemula’s mother and to A. Mangai aka V. Padma, my mother. Two women who fight for social justice and who have inspired their children to do the same. 

On 17th January 2016 Rohith Vemula, a Science PhD student at Hyderabad Central University (HCU) took his own life. Rohith and I were on similar University campuses but ten years apart. I watched the mobilisations in HCU and then all over the country of students raising their voices against caste oppression on university campuses, almost wishing I was a student with them. It was Rohith’s final letter however, that left an indelible mark on me. Like many others I, too, got to know him through that letter. Since then, I have had numerous conversations with him in my heart. Sometimes they are rants and other times I ask him questions about nature, science, the skies, and the stars. I don’t know a thing about these things and I imagine how much I would have enjoyed his company, as he knew so much about all of this. I often wonder if he would have enjoyed my company… These chats are of the kind of political-personal relationship I love. The ones where we aren’t just heatedly and hurriedly plotting revolutions, but also taking a moment to marvel at the stars. These conversations weren’t meant to be as he, like countless other Dalit students in casteist Indian society, were murdered by the institutions that were supposed to be their salvation; institutions where they had reached after countless struggles of their own, their families, and their communities. Nevertheless, I wrote him a reply on 19th February 2016, just over a month after he left us. If I had hand-written that letter it would have been punctuated by tear stains. It was meant for him to read. I don’t know if he read it… I only shared it with my near and dear ones, who are few.

Today, almost seven years after his death, I share this letter publicly in the hope that it can contribute to ongoing conversations about caste identities, experiences, violences, pasts, presents, and futures. I hope it can contribute to conversations about annihilating caste, a process and struggle that is imperative if we are ever to have the experience of feeling ourselves and one another as being “a glorious thing made up of stardust.”

If nothing, I hope my letter can be a momentary anchor, at least for some, as we continue to grieve this glorious mind we have lost. Know that if you find yourself weeping for Rohith, for yourself, and for all of us living in this brutalised and scarred world, at least you are not alone.

The letter has not been updated or edited much since it was first written. I share it here with you as it took form in that moment of grief.

Thank you to Sarala Emmanuel, Kaushiki Rao, Tashi Choedup, Lata Mani, Deepa Dhanraj, and Gowthaman Ranganathan who read my letter before it saw the light of day and affirmed for me that one day it should. Thank you. Thank you to Nithya Rajan and Richa Nagar for so gently sitting with my letter and ensuring it shows itself clearly while not tampering with its essence. Thank you to Suneetha Achyutha for agreeing to translate it so readily so that Radhika Vemula and countless others who read Telugu can access this work.

Along with this letter please watch Deepa Dhanraj’s film ‘We have not come here to die’ which will be available through AGITATE!  until January 30, 2023, to mark Rohith’s Birthday on 30th of January. You may also be interested in a poem by Sarah Almeida, Matheus Caetano, Raquel Chaves, and Josinelma Rolande, that was seeded in a workshop they did with Richa Nagar on ‘Stories, Bodies, Movements’ at the University of Brasilia in August 2019. Their poem, too, began as a conversation with Rohith’s journey “from shadows to the stars.”

 

ప్రియమైన రోహిత్ … 

ఈ ఉత్తరాన్ని రాధికా వేములకి, మా అమ్మ ఎ. మంగయి (వి. పద్మ) కు అంకితమిస్తున్నాను. ఇద్దరూ సామాజిక న్యాయం కోసం పోరాడి, తమ పిల్లలని కూడా ఆ మార్గంలో నడిపిన వారే.

2016, జనవరి 17 న హైద్రాబాదు సెంట్రల్ యూనివర్సిటీ సైన్స్ డాక్టరల్ విద్యార్థి రోహిత్ వేముల తన ప్రాణాలని తీసుకున్నాడు. నేను, రోహిత్, పది సంవత్సరాల తేడాతో, ఒకే రకమైన యూనివర్సిటీ క్యాంపస్ లలో చేరి, చదువుకున్నాం. హైద్రాబాదు యూనివర్సిటీలో, ఇతర విశ్వవిద్యాలయాల్లో కుల అణచివేతకు, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు గమనిస్తూ, నేను కూడా పదేళ్ల తర్వాత విద్యార్దినయుంటే బాగుండేది అనుకున్నాను. నా మీద చెరపలేని ముద్ర వేసింది మాత్రం రోహిత్ రాసిన చివరి వుత్తరం. చాలా మంది లాగే నాక్కూడా అతడేమిటో ఆ ఉత్తరం ద్వారానే తెలిసింది. అది చదవినప్పటినుండి నా మనసులో అతనితో లెక్కలేనన్ని సంభాషణలు జరిపాను. కొన్ని సార్లు అవి ఉత్త ప్రేలాపనల స్థాయిలో మాత్రమే మిగిలిపోయేవి గానీ, కొన్ని సార్లు ప్రక్రుతి, సైన్స్, ఆకాశం, నక్షత్రాల గురించి అతణ్ణి చాలా ప్రశ్నలు వేసేదాన్ని. ఈ విషయాల గురించి నాకేం తెలియదు కాబట్టి, అవన్నీ తెలిసిన అతనితో మాట్లాడితే ఆ సంభాషణలు ఎంత బాగుండేవో అని ఊహించుకునే దాన్ని. నాతో మాట్లాడటం అతనికి నచ్చుతుందో, లేదో నని సందేహ పడేదాన్ని. వ్యక్తిగతం, రాజకీయం కలిసే అటువంటి సంభాషణాలంటే నాకు ప్రాణం. వాటిల్లో హడావిడిగా, ఆందోళనల మధ్యలో విప్లవ సాధనకోసం చేసే పధక రచనల కంటే, ఇలా నక్షత్రాల గురించి కూడా ఆలోచిస్తాం. ఈ సంభాషణలు ఎప్పుడూ వాస్తవ రూపం తీసుకోలేదు. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమూహ పరంగా ఎన్నో కష్ట నష్టాల కోర్చి అక్కడి దాకా వచ్చిన వాళ్ల భవిష్యత్తు కి దారులు వేయాల్సిన విశ్వ విద్యాలయాలలో సంస్థాగత హత్యలకు గురయిన ఎంతో మంది దళిత విద్యార్థుల లాగే రోహిత్ కూడా సంభాషణలకి అందనంత దూరం వెళ్ళిపోయాడు. ఫిబ్రవరి 19, 2016 న, అతను వెళ్ళిపోయిన నెలకి,  నేను రోహిత్ ఉత్తరానికి జవాబు రాసాను. చేత్తో రాసుంటే, నా కన్నీళ్ల మరకలతో నిండి పోయు ఉండేది ఆ వుత్తరం. అతను చదవాలనే ఉద్దేశంతో రాసాను. చదివాడో లేదో తెలియదు… నేను మాత్రం చాలా కొద్ది మంది నా దగ్గరి వాళ్ళతో మాత్రమే దీన్ని పంచుకున్నాను.

దాదాపు ఏడేళ్ల తర్వాత, ఈ రోజు, ఈ ఉత్తరాన్ని అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. కుల పరమైన అస్తిత్వం, అనుభవాలు, హింస, గతాలు, భవిష్యత్తులు, ప్రస్తుతాల గురించి జరుగుతున్న సంభాషణలకి ఇది కూడా పనికొస్తుందేమోనని నా ఆశ. మనందరం ‘నక్షత్రాల ధూళితో తయారుచెయ్య బడ్డ కాంతి వంతమైన వాళ్లమనే’ విషయం అనుభవం లోనికి రావాలంటే కుల వ్యతిరేక సంఘర్షణ, ఈ చర్చా ప్రక్రియలు తప్పనిసరి అవుతాయి. ఆ కుల నిర్మూలనకు సంబంధించిన సంభాషణలకు కూడా ఇది తోడ్పడాలని నా కోరిక.

అదంతా కాకపోయినా, ఈ ఉత్తరం చదువుతున్నప్పుడు కనీసం కొంతమందికయినా మనమెంత గొప్ప ఆలోచనా వంతుణ్ణి కోల్పోయామో నని అనిపిస్తే చాలు. రోహిత్ ని తలుచుకుని, ఈ క్రూరమయిన, గాయాలతో నిండిన ప్రపంచంలో జీవిస్తున్న మీకోసం అలాగే అనేక మంది కోసం మీరు కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, మీతో పాటు ఇంకా చాలా మంది వున్నారని గుర్తుంచుకోండి.

2016 లో దీన్ని రాసిన తర్వాత ఈ ఉత్తరానికి ఏ మార్పులు, చేర్పులు చెయ్యలేదు. ఆ దుఖ్ఖ పూరిత సందర్భంలో రాసిన దాన్ని ఉన్నదున్నట్లు మీతో పంచుకుంటున్నాను.

సరళా ఎమాన్యూయల్, కౌశికి రావు, దీప ధనరాజ్, తాషి చౌడూప్, గౌతమన్ రంగనాథన్ – ఈ ఉత్తరాన్ని బయటకి రాకముందే చదివి, ఏదో ఒక రోజు ఇది అందరితో పంచుకోవాలని చెప్పినందుకు మీరందరరికీ కృతజ్ఞతలు. నా ఉత్తరాన్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని, అది బయటి కొచ్చే వరకూ దాని సారం ఎక్కడా దెబ్బ తినకుండా చూసుకున్నందుకు నిత్యా రాజన్, రిచా నాగర్ లకు కృతజ్ఞతలు. అడగంగానే దీన్ని తెలుగులోకి అనువాదం చెయ్యటానికి ఒప్పుకుని రాధికా వేముల తో సహా తెలుగు చదివే వాళ్లందరికీ దీన్ని అందుబాటులోకి తెచ్చినందుకు ఎ.  సునీత కి కృతజ్ఞతలు.

జనవరి 30 న రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ వుత్తరంతో పాటు దీప ధనరాజ్ తీసిన అద్భుతమయిన సినిమా ‘వి ఆర్ నాట్ హియర్ టు డై’ ని కూడా ఆజిటెట్ ద్వారా మీకు అందిస్తున్నాం. జనవరి 30 వరకు సినిమా అందుబాటులో ఉంటుంది. సారా అల్మెయిదా, మాథిస్ షెటానో, రాకెల్ చావెజ్, జోసి సెల్మ రోలాండ్ రాసిన కవిత కూడా చదువచ్చు. రిచా నాగర్ ‘కథలు, శరీరాలు, ఉద్యమాలు’ అన్న విషయంపై బ్రసిలియా యూనివర్సిటీలో 2019 ఆగస్టు లో జరిపిన వర్క్ షాప్ లో ఇది పురుడు పోసుకుంది. అ కవిత  కూడా ‘నీడల నుండి నక్షత్రాల వరకూ’ జరిగిన రోహిత్ ప్రయాణంతో సంభాషణ  రూపంలో ప్రారంభమయింది.


Dear Rohith, 

I hope you are happy wherever you are. You did say you are happier in death than in life. So I am allowed to wish that, aren’t I? 

I wanted to reply to you to say that I know what you mean. So often I feel alone in talking of things like being connected to the things around me, when I have long chats with trees. I made many significant decisions as a teenager in consultation with this Baobab tree we have in Madras. I root my childhood in this big Banyan tree in Madras. You would have liked them both. You’re all science-y and would have known more about them in ways I don’t. Anyway, I digress. I feel really, genuinely connected and happy in a state of realization that I am one part of a complex world of many different beings. I also, like you, wish we could love them. Naturally. I wish we could love without hurt too. I wish we all knew and felt that our “originality” is in that natural loving and connectedness rather than in “artificial art.” 

The difference between us though, is that my birth was not a fatal accident. It was a blessing. My parents fell in love. Defied caste, in ways that may not have been the most radical now or then, in the longer run, or in the bigger perspective. But it was to them and it is to me. So I grew up blessed with caste privilege for all practical purposes with traces of untouchability thrown at me by those related to me by blood. I guess it is their blood impurely in my body that made me untouchable to them. Warped logic no? For the most part, my life has been a blessing. 

This for me has come to mean that I can coexist with the realization that I want to be interconnected to nature and I know this is not a neutral apolitical choice. Humans have infiltrated our very being with toxic power. We all have that power in us AND we are all oppressed by it. To resist both, the having of power requires self-reflection and a fight. So does the struggle against being oppressed by it. But somehow, the fight takes us so far away from who we are; each of us that unique thing, that “glorious thing made of star dust.” Our fight against oppression does to us what the oppression itself does to us. We need to call ourselves fixed names, number ourselves, make ourselves part of the vote in order to be heard and seen. We may even be heard and seen this way to some extent, often with severe limitations. But often this version of being seen and heard, is in the way of, or is a barrier to, us being felt. It is a barrier to all our parts AND our glorious whole being felt. Felt by others, but more importantly by ourselves. That distance between the body and the soul you speak of–I’ve seen that happen to me so many times. I too have turned into a monster so many times. When faced with irrational unkindness, hatred. When faced with evil that can barely be spoken of. One is afraid to find a language to describe it, as it is real enough as it is, maybe describing it will make it even more real. Sigh. I too have turned into a monster, friend. But unlike you, I found refuge in others, in myself, to come back to myself. 

I feel you didn’t have that. Not enough at least. The fatal accident that is your birth is one reason for that. I am sure of it. We are all well aware of that accident, the cursed life of a Dalit on our scarred and wretched land. But you lived a life after. Found your passion in the stars, in science, in nature. Yet, the life that grew around you, that you built, couldn’t give you the space to come back to yourself. That life of resistance, survival, and moments of living even–didn’t pave the path for your loving, kind soul to blossom. Our slogans “number” us, Rohith. They “thing” us, too. And you aren’t blessed at birth like me–with privilege and with love. So you didn’t have enough breath to breathe away the thinging of you. And for that I am sorry, my friend. 

My blessing is not my curse. My blessing is my strength and my limitation. My privilege is my strength and my limitation. It made me, yet it does not bind me. To be unbound is in itself a privilege, too. And the cycle goes on. Your curse made you but did not bind your soul. That, my friend, is your resistance. A resistance that knows what it is, not just what it is not.

I promise to you my friend, in my own earthworm-y way, I would like to spend the rest of my days on this earth, already longer than yours, turning the soil to make room for paths for loving souls to stay close to their bodies. For the thinging and numbering to not bind us so much so that we don’t even know when the stardust showers us. I do hope more Rohiths can find at least as much hope in life as you did in death. I will turn the soil in my own little way in the hope to make space for that. 

I hope that HCU gives the 1,70,000 to your family and 40,000 from that to Ramji. I will ask friends about that. The harassment your mother is being put through. Oh, Rohith, I hope it ends soon so she can cry for you. 

I do hope with all my strength and heart that you are happy wherever you are. I hope you traveled to the stars and to other worlds like you wanted. I do hope you are happy in death my friend. I mourn your death as I do your life, too. I  am also eternally thankful that you knew–somewhere deep within you–that you too were a mind, a glorious thing made of stardust. I will remain moved by the fact that, as you left this earth, you wrote that down so the rest of us can remember that we too are that. Thank you, friend. 

Jai Bhim. 

Ponni.

 

ప్రియమైన రోహిత్,

నువ్వెక్కడున్నా సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాను. జీవితం కన్నా మరణం లోనే సంతోషం ఉందని అన్నావు కదా. కనీసం అక్కడన్నా ఆనందంగా ఉన్నావని నేను ఆశ పడటంలో తప్పు లేదు కదా.

నువ్వు అలా ఎందుకన్నావో నాకు అర్ధం అవుతుందని నీకు చెప్పాలనుకున్నాను.  నా చుట్టూ వున్న వాటితో నేను ఏర్పర్చుకున్న అనుబంధాల గురించి, చెట్లతో  నేను జరిపే దీర్ఘ సంభాషణల గురించి చెప్పటానికి నాకెవ్వరూ దొరకలేదు. యుక్త వయసు లోకి ప్రవేశిస్తున్నప్పుడు మద్రాసులో మా ఇంటి దగ్గర్లోని బావబాబ్ చెట్టుతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నేను అన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేదాన్ని. నా చిన్నతనమంతా అక్కడి మర్రి చెట్టుతో గడిచింది. నీకు ఆ రెండు చెట్లూ తప్పకుండా నచ్చి ఉండేవి. నువ్వు సైన్స్ మనిషివి కాబట్టి, నాకంటే ఆ చెట్ల గురించి నీకింకా బాగా అర్ధమయ్యి ఉండేది. చూడు, చెప్పాలనుకున్నది మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాను. ఈ సంక్లిష్ట ప్రపంచంలోని అనేక జీవ రాశులలో నన్ను నేను ఒక భాగంగా చూసుకున్నప్పుడు వాటిన్నింటితో నాకు సంబంధం ఉందని అనిపించి నాకు అత్యంత సంతోషం కలుగుతుంది. నీ లాగా, నాక్కుడా, మనం అన్నింటినీ ప్రేమించ గలిగితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అంతే కాదు, బాధల్లేని ప్రేమ ఉంటే బాగుంటుందని కూడా అనిపిస్తుంది. మనుషులుగా మన ‘ఒరిజినాలిటీ’ అటువంటి సహజమైన ప్రేమ, అనుబంధాల లోనే ఉంటుందని, ‘ఆర్టిఫీషియల్ ఆర్ట్’ లో ఉండదని అందరికీ తెలిస్తే, అర్ధమయితే ఎంత బాగుంటుందో కదా.

మన ఇద్దరి మధ్య తేడా ఏంటంటే, నా పుట్టుక  ఒక ‘ఫాటల్ యాక్సిడెంట్ ‘ కాదు. అదొక దీవెన. మా అమ్మా నాన్నలు ప్రేమించుకుని, కులాన్ని ధిక్కరించారు. ఆ ప్రేమ, ధిక్కారం ఆ కాలంలోనూ, తర్వాతా ఎవరికీ పెద్ద రాడికల్ గా అనిపించక పోయి ఉండచ్చు. దీర్ఘ కాలిక దృక్పధం లో, విస్తృత అవగాహన లో చూసుకున్నా కూడా రాడికల్ కాకపోవచ్చు. కానీ, వాళ్ళకీ, నాకూ కూడా అది ఒక రాడికల్ అడుగే. అప్పుడప్పుడూ నా రక్త సంబంధీకుల మా పట్ల చూపించిన అంటరాని తనం జాడలు తప్ప, నేను అన్ని రకాలుగా కులాధిపత్య విశేషాధికారం, అదిచ్చే ఆశీర్వాదంతో నే పెరిగాను. వారి రక్తం కలుషితమయ్యి నా శరీరంలో ప్రవహించటం నన్ను వారికి అంటరాని దాన్ని చేసి ఉండొచ్చు. ఎంత వక్రమైన తర్కమో కదా. సరే, ఏదేమయినా, నా జీవితం చాలా వరకూ ఒక దీవెన గానే గడిచింది.

నా మటుకు నాకు, ప్రకృతితో దగ్గరి సంబంధాలు ఏర్పర్చుకోవాలనే తపనతో జీవించొచ్చని అర్ధమయింది. అదేమీ తటస్థ రాజకీయ నిర్ణయమో లేక రాజకీయాల బయట ఉండటం తోటో సమానం  కాదు. మనుషులు ప్రకృతిలో భాగమయిన మన అణువణువునీ తమ విషపూరిత అధికారంతో నింపేశారు. మనందరిలో భాగమయి పోయిన ఈ అధికారం కారణంగా మనం కూడా అణచివేతకు గురవుతున్నాం.  మనకున్న అధికారం, మన అణచివేత లు రెండింటినీ వ్యతిరేకించాలంటే అధికారం, అణచివేత ల గురించి ఆత్మ పరిశీలన, పోరాటం రెండూ చాలా అవసరం. కానీ ఎందుకో, పోరాటాలు మనల్ని మన నుండి ఎంతో దూరం తీసుకెళ్లి పోతుంటాయి; మనలో ప్రతి ఒక్కరూ అపురూపమైన వాళ్ళమే – ‘నక్షత్రాల మట్టితో ఏర్పడిన కాంతివంతమయిన జీవులమే’. అణచివేతకి వ్యతిరేకంగా మనం చేసే పోరాటం కూడా ఎందుకో మనల్ని అణచివేత లాగే ప్రభావితం చేస్తోంది. మన గొంతు వినిపించాలన్నా, మనల్ని ఎవరయినా పట్టించుకోవాలన్నా, మనకి మనం స్థిరమైన పేర్లు, నంబర్లు ఇచ్చుకోవాలి, ఓటులో భాగం కావాలి.  మనల్ని అప్పుడే పట్టించుకుంటారు, వింటారు కూడా. అది కూడా, తీవ్రమైన పరిమితులకి లోబడి మాత్రమే. కానీ మనల్ని గురించి అచ్చంగా ఆలోచించుకోవటానికి ఈ రకమైన ఇతరుల ద్రుష్టి పెద్ద అడ్డంకి. మనలోని భిన్న పార్శ్వాలకే కాదు, మన అపూర్వమైన సంపూర్ణ అస్తిత్వాన్ని గురించి మనం ఎరుక ఏర్పర్చుకోవటానికి కూడా ఇది పెద్ద అడ్డంకి. ఇతరులకు మాత్రమే కాదు, మనక్కూడా ఇవి అడ్డంకే. ఆత్మకి, శరీరానికి మధ్య ఏర్పడే దూరం గురించి నువ్వు మాట్లాడావే – అది నాకు చాలా సార్లు అనుభవం లోకి వచ్చింది. నేను కూడా చాలా సార్లు ఒక బ్రహ్మ రాక్షసి గా మారిపోయాను. ద్వేషం, కారణం లేని నిర్దయత నా పట్ల కనపర్చినప్పుడు. మాటల్లో చెప్పలేని కీడు నా పట్ల తలపెట్టినప్పుడు. దాని గురించి వర్ణించే భాషని వెతకటానికి భయపడ్డాను; జరిగిన విషయ వాస్తవికతని తట్టుకోలేని స్థితిలో, దాన్ని వర్ణిస్తే అది మరింత నిజమయి పోతుందేమోనని భయపడ్డాను. నేను కూడా ఒక  బ్రహ్మ రాక్షసి గా మారిపోయాను స్నేహితుడా! అయితే నీలా కాకుండా, నేను ఇతరులలో, నాలో నేనే శరణాన్ని వెతుక్కున్నాను, పొందాను, నాలోకి నేను తిరిగొచ్చాను.

నీకు అలాంటి శరణు దొరక లేదు, దొరికినా అది నీకు సరిపడినంత ఆశ్రయం ఇవ్వలేదు. నీ పుట్టుక ‘ఫాటల్ యాక్సిడెంట్’ కావటం దీనికొక కారణమని నాకు బలంగా అన్పిస్తోంది. ఆ యాక్సిడెంట్ గురించి, ఈ పవిత్ర, దిక్కుమాలిన దేశంలో దళితుల శాపగ్రస్త జీవితం గురించి మా అందరికీ తెలుసు. కానీ దాని తర్వాత కూడా ఇంకో జీవితం నువ్వు జీవించావు. నక్షత్రాలు, సైన్స్, ప్రకృతి కి అంకితమయ్యావు. నీ చుట్టూ పెరిగిన కొత్త జీవితం, నీ అంతట నువ్వు నిర్మించుకున్న జీవితం కూడా నీలోకి నువ్వు తిరిగి రావటానికి కావాల్సినంత చోటు కల్పించలేక పోయింది. ఆ ధిక్కార జీవితం, తట్టుకుని నిలబడటం, మధ్యలో జీవించిన క్షణాలు – ఏవీ కూడా ప్రేమ, దయతో నిండిన నీ ఆత్మ వికాసానికి దారి చూపించలేక పోయాయి. మన నినాదాలు మనల్ని ‘సంఖ్యలు’ గా మారుస్తాయి, రోహిత్.  మనల్ని ‘వస్తువులుగా’ కూడా మారుస్తాయి. నాలాగా నీకు ప్రేమ, ప్రివిలేజ్ వున్న పుట్టుక లభించలేదు. నిన్ను ‘వస్తువు’ గా మార్చే క్రమాన్ని ఆపేటంత ప్రాణ వాయువు నీ దగ్గర లేక పోయింది. మిత్రమా, దాని గురించి నిన్ను క్షమాపణ కోరుతున్నాను.

నా దీవెన నాకు శాపం కాలేదు. నా దీవెన నాకు బలం, నా కొక ప్రతిబంధకం కూడా. నా ప్రివిలేజ్ నా బలం, నాకొక ప్రతిబంధకం. అది నన్ను తయారుచేసింది కానీ, నన్ను నిలువరించలేక పోయింది. బంధనాలు లేకుండా ఉండటం కూడా ఒక విశేషాధికారమే కదా. ఈ కాల చక్రం అలాగే తిరుగుతూ ఉంటుంది. నీ శాపం నిన్ను తయారుచేసింది కానీ నీ ఆత్మని బంధించలేక పోయింది. మిత్రమా, అదే నీ ధిక్కారం. నీ ధిక్కారానికి, తానేం కాదో మాత్రమే కాదు, తానేమిటో కూడా బాగానే తెలుసు.

నేను నీకో ప్రమాణం చేసున్నాను మిత్రమా – ఈ భూమి మీద బ్రతికినంత కాలం, నీకన్నా ఇప్పటికే చాలా ఎక్కువ రోజులు బ్రతికేసాను కానీ, వాన పాము లాగా మట్టిని తవ్వి నీలాంటి ప్రేమ నిండిన ఆత్మలు, తమ శరీరాలకి దగ్గరగా ఉండేటట్లు తొవ్వలు తయారు చేస్తాను. మనల్ని ‘సంఖ్యలు’, ‘వస్తువులుగా’ తయారు చేసే క్రమాలు మనల్ని బంధించేసి, మన మీద వర్షించే నక్షత్ర ధూళి ని కూడా గుర్తించకుండా చేస్తున్నాయి. నువ్వు మరణంలో పొందిన ఆశ అనేకమంది ఇతర రోహిత్ లు జీవితంలో పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నా మటుకు నేను మట్టిని చిన్న చిన్నగా తవ్వి దాని కోసం బాటలు వేస్తాను.

హైదరాబాదు విశ్వవిద్యాలయం మీ కుటుంబానికివ్వాల్సిన 1,70,000 రూపాయలు ఇస్తుందని, 40,000 రాంజీ కి ఇస్తుందని ఆశిస్తున్నాను. నా మిత్రులని దాని గురించి అడుగుతాను. మీ అమ్మ ఎదుర్కుంటున్న వేధింపులు తొందరగా ఆగుతాయని, ఆగితే ఆవిడ నీ కోసం మనసారా ఏడవగలుగుతుందని ఆశిస్తున్నాను.

నా గుండె బలమంతా కూడగట్టుకుని నీవెక్కడున్నా సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను. నక్షత్రాల దగ్గరికి, నువ్వు చూడాలని కోరుకున్న ఇతర ప్రపంచాలకి ప్రయాణించి ఉంటావని ఆశిస్తున్నాను. మరణంలో అయినా సంతోషంగా ఉన్నావని ఆశిస్తున్నాను. నీ జీవితం గురించి, నీ మరణం గురించి రెండింటి గురించి నేను దుఃఖిస్తున్నాను. ఆలోచించే మనసు నీకుందని, నువ్వు నక్షత్ర ధూళితో తయారయ్యావని నీ గుండె లోతుల్లో ఎప్పుడో అప్పుడు అనుకున్నందుకు; అందరూ నక్షత్ర ధూళితోనే  తయారయ్యారని మాకు గుర్తు చేసినందుకు నీకు ఎప్పడికీ రుణపడి వుంటాను. కృతజ్ఞతలు మిత్రమా!

జై భీం.

పొన్ని

___________________________________________

You can read other installments of the Holding Movements, Agitating Epistemes series, such as Doing History by Ponni Arasu and Kamala Vasuki on AGITATE! Now. 

To commemorate Rohith’s birthday on January 30th, AGITATE! is hosting a virtual screening of We Did Not Come Here to Die (2018) by Deepa Dhanraj about Vemula’s institutional murder in 2016 and the student movement that followed, available until January 30th, 2023. Register here to watch.

Article by: