ప్రొ . శైలజ పైక్ కు మెకార్థర్ ఫెలో గా గుర్తింపు లభించిన సందర్భంలో యాజిటెట్! హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుతోంది
“మనుషుల మధ్య అసమానతలు, మనుషుల అమానవీకరణ గురించి చేసే అధ్యయనాలు విశ్వజనీన మానవత్వం, సార్వత్రిక విముక్తి కి సంబంధించి కొత్త ఆలోచనలకు దారులు వేస్తాయి”
ఈ లోచూపు చరిత్రకారిణి శైలజ పైక్ ఆమె దళిత స్త్రీల జీవిత విశ్లేషణల ద్వారా ఆధునిక భారత దేశంలో కులం, జెండర్, లైంగికత ల చరిత్రల గురించి జరిపిన అద్భుతమైన పరిశోధనల నుండి వచ్చింది. మేధో శక్తి, సృజనాత్మకత, నిర్దిష్టత కలబోసి ఆవిడ చేసిన పని భారత సమాజంలో అధికారం, అంచులనుండి జరిపే సంఘర్షణల గురించి మనం జరిపే పరిశోధనలు, రాసే రాతల తీరు తెన్నులను సమూలంగా మార్చే సింది. శైలజ పైక్ ను మెకార్థర్ ఫెలో గా గుర్తించిన ఈ సందర్భం యాజిటెట్! కు ఒక సంబరం. ఆమెతో పాటు ఇతర 20 మంది స్ఫూర్తి దాతలైన వాళ్లకి కూడా ఈ ఫెలోషిప్ లభించింది. వారిలో కవి జెరికో బ్రౌన్, సినిమా నిర్మాత స్టెర్లిన్ హారజో, న్యాయ పరిశోధకులు మరియు పబ్లిక్ పాలసీ పరిశోధకులు డొరొతి రాబర్ట్స్, దివ్యాంగుల న్యాయం కోసం పోరాడే అలిస్ వాంగ్ కూడా వున్నారు. మెకార్థర్ గ్రాంట్ ను జీనియస్ గ్రాంట్ అని పిలుస్తారు. దీని ద్వారా అరుదైన సృజనాత్మకత, భవిషత్తులో మరింత పని చేసే సంభావ్యత చూపించే వ్యక్తులకి $800,000 డాలర్లు ఇస్తారు. దాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు.
నిర్ధారిత వ్యవస్థలలో జరిగే జ్ఞాన ఉత్పత్తికి శైలజా పైక్ సంఘర్షణా దృక్పధంతో చేసిన అద్వితీయ సేవకి లభించిన ఈ గుర్తింపు ప్రపంచ ఉన్నత విద్యా రంగంలోనే ఒక మైలు రాయి. నర మేధాలు చేస్తున్న యుద్ధాల మధ్యలో జీవిస్తున్న మనకి శైలజా పైక్ పని ఒక స్ఫూర్తి నిస్తుంది. సంఘర్షణల నుండి పుట్టే జ్ఞానం, విమర్శల ద్వారా మనకున్న జ్ఞానం, విమర్శల పరిధిని విస్తరించుకుని, లోతుని పెంచుకుని కొత్త రకాలుగా ఆలోచించమని ఆమె పరిశోధన మనల్ని ప్రేరేపిస్తుంది. పధ్ధతి ప్రకారం అంచుల్లోకి నెట్టబడి, అవమానించబడి, తొక్కి వెయ్య బడిన విమర్శనాత్మక జ్ఞానాన్ని సంఘర్షణలు జరిగిన చోటే కాకుండా, అన్ని చోట్లా మళ్ళా అంది పుచ్చుకుని పెంపొందింప చేయడానికి మనం దారులు వెయ్యాలని చెప్తుంది. సార్వజనీన మానవత్వం, సార్వత్రిక విముక్తి కోసం జరిగే అన్వేషణలో వచ్చే మేధోపరమైన, రాజకీయ సవాళ్ళ గురించి ప్రొ. పైక్ భవిషత్తులో జరిపే సాహసవంతమైన పరిశోధనల ద్వారా మరింత నేర్చుకోవడానికి మేము సిద్ధంగా వున్నాం.
TRANSLATION: ENGLISH